తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్.. ఏబీపీ సీఓటర్ ఫైనల్ సర్వే
తెలంగాణలో అధికారం చేపట్టాలంటే 60మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఆ మేజిక్ ఫిగర్ ని బీఆర్ఎస్ సాధిస్తుందని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది.
తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చి చెప్పింది. ఎన్నికల సీజన్ మొదలయ్యాక ఇది ఫైనల్ సర్వేగా ఏబీపీ సంస్థ పేర్కొంది. ఈ ఫైనల్ సర్వే ఫలితాలు కాసేపటి క్రితమే విడుదల చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందనే అంచనాల నేపథ్యంలో అధికారం చేపట్టేది, ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం బీఆర్ఎస్సేనని తేల్చేసింది ఏబీపీ.
తెలంగాణలో మొత్తం స్థానాలు 119
బీఆర్ఎస్ 49-61
కాంగ్రెస్ 43-55
బీజేపీకి 5-11
తెలంగాణలో అధికారం చేపట్టాలంటే 60మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఆ మేజిక్ ఫిగర్ ని బీఆర్ఎస్ సాధిస్తుందని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది.
తెలంగాణలో అత్యథికంగా 41 శాతం ఓట్లు బీఆర్ఎస్ కి పడతాయని ఏబీపీ సర్వే తేల్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ 39 శాతం వరకు ఓట్లు సాధిస్తుందని, బీజేపీ 14 శాతం దగ్గరే ఆగిపోతుందని తెలిపింది. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎవరికి ఓటు వేస్తారు అనే ప్రశ్నకు మెజార్టీ ప్రజలు కేసీఆర్ కే జై కొట్టారని తెలిపింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 3 వరకూ ఒపీనియన్ పోల్ నిర్వహించి ఈరోజు ఆ సర్వే రిపోర్ట్ ఈరోజు విడుదల చేసింది ఏబీపీ.