Telugu Global
Telangana

అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ ...ఎర్ర కోటపై గులాబీ జెండా -కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు తెలంగాణ భ‌వ‌న్‌లో అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదు ప్రజలు అని అన్నారు.

అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ ...ఎర్ర కోటపై గులాబీ జెండా -కేసీఆర్
X

'అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్' అనే నినాదంతో రాబోయే ఎన్నికల్లో ముందుకు పోతామని, ఎర్ర కోటపై గులాబీ జెండ ఎగరవేస్తామని భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు తెలంగాణ భ‌వ‌న్‌లో అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదు ప్రజలు అని అన్నారు.

''ఇప్పుడు దేశానికి కావాల్సింది. ఓట్ల కోసం మాత్రమే పని చేసే రాజకీయ పార్టీలు కాదు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు గల పార్టీ కావాలి. నూతన ఆర్థిక విధానాలు, పర్యావరణ విధానాలు, మహిళా సాధికారత కోసం జాతీయ విధానం, వ్యవసాయ విధానం...ఇలా దేశాభివృద్ది కోసం నూతన విధానాలతో పాటుపడే నూతన రాజకీయ పార్టీ దేశానికి ఇప్పుడు అత్యవసరం. వచ్చే ఎన్నికల్లో దేశంలో రాబోయేది రైతు ప్రభుత్వమే. '' అని కేసీఆర్ స్పష్టం చేశారు.

'అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్' అనేది భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని కేసీఆర్ పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తామ‌న్నారు. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు.

కర్నాటక శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరపున ప్రచారం చేస్తామని చెప్పిన కేసీఆర్ ఈ సారి కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కర్నాటకలో బీఆరెస్, జేడీఎస్ కు మద్దతిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

First Published:  9 Dec 2022 10:17 AM GMT
Next Story