Telugu Global
Telangana

ఆరా సంస్థ‌ తప్పుడు ప్రచారం... కోర్టులో కేసు వేస్తానన్న పాల్

ఆరా సర్వే సంస్థ చేసిన సర్వే, విడుదల చేసిన ఫలితాలపై అన్ని వైపుల నుండి విమర్షలు వస్తున్నాయి. ఆరా మస్తాన్ ఆరెస్సెస్ కార్యకర్త అని, అందుకే బీజేపీకి అనుకూలంగా సర్వేలు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు.

ఆరా సంస్థ‌ తప్పుడు ప్రచారం... కోర్టులో కేసు వేస్తానన్న పాల్
X

ఆరా సర్వే సంస్థ చేసిన సర్వే, విడుదల చేసిన ఫలితాలపై అన్ని వైపుల నుండి విమర్షలు వస్తున్నాయి. ఆరా మస్తాన్ ఆరెస్సెస్ కార్యకర్త అని, అందుకే బీజేపీకి అనుకూలంగా సర్వేలు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మస్తాన్ అరెస్సెస్ కార్యకర్త అని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరా సంస్థపై ధ్వజమెత్తారు.

ఆరా సంస్థ ఎన్నికల సర్వే పేరుతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. ఈ విషయంలో తాను ఆరా అధినేత మస్తాన్ పై హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు పాల్ తెలిపారు. అబద్దాల సర్వేలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలు మస్తాన్ ను గ్రామాల్లో తిరగనివ్వరని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ కు 36 శాతం, బీజేపీకి 30 శాతం ఓట్లు వస్తాయని మస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజానికి తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉందని కేఏ పాల్ అన్నారు.

భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యవర్గ సమావేశాల కోసం 2 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని పాల్ మండిపడ్డారు. బండి సంజయ్ మీద కూడా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని దేవుడని పొగడటమేంటని ఆయన ప్రశ్నించారు.

First Published:  14 July 2022 7:31 PM IST
Next Story