బీఆరెస్ లో చేరిన మాజీ ఎంపీ, AAP మహారాష్ట్ర వైస్ ప్రెసిడెంట్
హరి భావు రాథోడ్‌తో పాటు, ఇతర పార్టీల నుండి కూడా కొంతమంది నాయకులు BRS లో చేరారు.
BY Telugu Global5 March 2023 1:55 AM
X
Telugu Global Updated On: 5 March 2023 1:55 AM
మాజీ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్ర యూనిట్ వైస్ ప్రెసిడెంట్ హరి భావు రాథోడ్ శనివారం హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి లాంఛనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.
హరి భావు రాథోడ్‌తో పాటు, ఇతర పార్టీల నుండి కూడా కొంతమంది నాయకులు BRS లో చేరారు. చంద్రాపూర్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సందీప్ కరాపే, బీజేపీ నుంచి గోండ్ పిప్రీ నగర్ సేవక్ తాలూకా అధ్యక్షుడు బాబాన్ నిఖోడ్, శివసేన తాలూకా సమన్వయకర్త ఫిరోజ్ ఖాన్, బీజేపీ నాయకుడు శైలేష్ సింగ్ కూడా ముఖ్యమంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
Next Story