Telugu Global
Telangana

కేటీఆర్‌ను కలిసిన ఆదిత్య థాకరే, టి‍ హబ్ కు అభినందన

"ఐటి మంత్రి కేటీఆర్ ను కలవడం, సుస్థిరత, పట్టణీకరణ‌, సాంకేతికత, భారతదేశ వృద్ధికి అవి ఎలా తోడ్పడుతాయి అనే విషయాలపై చర్చించాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకటే అవ్వడం అద్భుతంగా, ప్రోత్సాహకరంగా ఉంది" అని థాకరే ట్వీట్ చేశారు.

కేటీఆర్‌ను కలిసిన ఆదిత్య థాకరే, టి‍ హబ్ కు అభినందన
X

శివసేన (యుబిటి వర్గం) యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. టి-హబ్‌లో జరుగుతున్న అద్భుతమైన పనిని ప్రశంసించారు.

కేటీఆర్ తో సమావేశంలో పట్టణీకరణ, సాంకేతికత, భారతదేశ వృద్ధికి అవసరమైన‌ చర్యలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

"ఐటి మంత్రి కేటీఆర్ ను కలవడం, సుస్థిరత, పట్టణీకరణ‌, సాంకేతికత, భారతదేశ వృద్ధికి అవి ఎలా తోడ్పడుతాయి అనే విషయాలపై చర్చించాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకటే అవ్వడం అద్భుతంగా, ప్రోత్సాహకరంగా ఉంది" అని థాకరే ట్వీట్ చేశారు.

టి-హబ్‌ను సందర్శించిన ఆయన, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. కేటీఆర్ తో తన సమావేశానికి సంబంధించిన చిత్రాలను షేర్ చేస్తూ, "టి-హబ్‌ను సందర్శించి, స్టార్టప్‌లు, ఆవిష్కర్తల కోసం అక్కడ సాగుతున్న‌ అద్భుతమైన పనిని చూశాను" అని ట్వీట్ చేశారు.

గత ఏడాది దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈవెంట్ సందర్భంగా థాకరే కేటీఆర్ తో సమావేశమయ్యారు.ఆ సమావేశం గురించి థాకరేకి గుర్తు చేస్తూ, కేటీఆర్ ట్వీట్ చేశారు... “గత సంవత్సరం దావోస్‌లో మా సమావేశం తర్వాత ఆదిత్య థాకరే తో మళ్లీ కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నాను. ” అన్నారు కేటీఆర్.

అనంతరం హైదరాబాద్ లోని గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో సంభాషించిన థాకరే, మహారాష్ట్ర వివిధ రంగాలలో వెనుకబడి ఉండటం బాధాకరమని అన్నారు.

“మహారాష్ట్రలో మనకు రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం ఉంది, అది రాజ్యాంగాన్ని పక్కన పెట్టింది. రాజకీయ అస్థిరత కారణంగా మహారాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించలేకపోతోంది’’ అని ఆయన అన్నారు.


First Published:  11 April 2023 10:16 PM IST
Next Story