హైదరాబాద్‌లో యువకుడిని చితకబాదిన పోలీసులు
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కాటేదాన్ దగ్గర రోడ్డు ప్రక్కన కూర్చున్న అతీఫ్ అనే యువకుడిని పోలీసులు చితకబాదారు.
BY Vamshi Kotas10 Oct 2024 2:20 PM
X
Vamshi Kotas Updated On: 10 Oct 2024 2:20 PM
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కాటేదాన్ దగ్గర రోడ్డు ప్రక్కన కూర్చున్న అతీఫ్ అనే యువకుడిని పోలీసులు చితకబాదారు. మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. బాధితుడి దగ్గర ఉన్న రెండు ఫోన్లు లాకున్నారు. శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.
తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కి వెళితే… కనీసం స్పందించకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని బాధితుడు ఆరోపిస్తునన్నారు. దయచేసి న్యాయం చేయాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌ను కోరుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతాలు పూర్తిగా అదుపు తప్పాయి. నేరస్థుల శిక్షించాల్సిన పోలీసులు సామాన్య ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు.
Next Story