అర్థరాత్రి మహిళా ఎంపీ ఇంట్లోకి చొరబడిన దుండుగుడు
ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్థరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు.

బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్థరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని కిచెన్, హాల్, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోనికి వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటూ, ఇటూ తిరిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై.. విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
తన ఇంటికి భద్రత పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, దుండగుడు ఇంట్లో చొరబడ్డ సమయంలో డీకే అరుణ లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందులో కుట్రకోణం దాగి ఉందని భద్రత పెంచలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. హైదరాబాద్ నగరంలో లా అండ్ అర్డర్ దెబ్బతిన్నది. తెలంగాణ హోంశాఖ మంత్రి లేకపోవడం సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే హోంశాఖ అంటిపెట్టుకోవడంతోశాంతి భద్రతలపై సమీక్ష జరిపే నాధుడే లేడు. సామాన్యుల నుంచి ప్రముఖుల కూడా భద్రత కరువైంది