సొరంగంలోకి క్వాడవర్ డాగ్స్ బృందం
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కార్మికుల అన్వేషణకు ముమ్మర యత్నాలు
BY Raju Asari7 March 2025 11:00 AM IST

X
Raju Asari Updated On: 7 March 2025 11:00 AM IST
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉదయం 7.15 నిమిషాలకు క్వాడవర్ డాగ్స్ బృందం సొరంగంలోకి వెళ్లింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు 110 మంది లోకోమోటార్‌లో టన్నెల్‌లోకి వెళ్లారు. డోగ్రా రెజిమెంట్ కమాండెంట్ పరీక్షిత్ మెహరా ఎన్‌డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బెల్జియంకు చెందిన క్వాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్నా గుర్తించగలుగుతాయి. అన్వేషణ అనంతరం లోపలికి వెళ్లిన బృందం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి రానున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Next Story