సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. ఓటుకు నోటు కేసులో విచారణకు ఆదేశం
ఓటుకు నోటు కేసులో అక్టోబర్ 16న నాంపల్లి కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశించింది.
ఓటుకు నోటు కేసులో ఆక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. ముత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. ఈ దశలో ఇవాళ్టి విచారణకు హాజరు కాలేమని నిందితులు తెలిపారు. వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాల్సిందేనని తెలిపింది. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు కావడంతో నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేశారు. 2015లో తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటుకు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటేడ్ శాసన మండలి సభ్యుడు స్టీఫెన్ సన్‌ను తెలుగు దేశం పార్టీకి మద్దతు తెలపాలని రేవంత్‌రెడ్డి డబ్బు ఎర చూపిన ఆరోపణలపై రేవంత్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్ సన్ ఇంట్లో రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఉన్నట్లు ఉన్న వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ దీనిపై సుధీర్ఘంగా విచారణ జరుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పిటీషన్ ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది.