Telugu Global
Andhra Pradesh

ఒక వ్యక్తి బాత్‌ టబ్‌ కోసం రూ.36లక్షలు ఖర్చు చేశారు : చంద్రబాబు

విశాఖ రిషికొండ ప్యాలెస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఒక వ్యక్తి విలాసం కోసం రూ. 36 లక్షలు పెట్టి బాత్ టబ్ చేయించారని ముఖ్యమంత్రి అన్నారు.

ఒక వ్యక్తి బాత్‌ టబ్‌ కోసం రూ.36లక్షలు ఖర్చు చేశారు : చంద్రబాబు
X

విశాఖ రిషికొండలో నిర్మించిన భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఒక వ్యక్తి విలాసం కోసం రూ. 36 లక్షలు పెట్టి బాత్ టబ్ చేయించారని ముఖ్యమంత్రి అన్నారు. రుషికొండ ప్యాలెస్‌కి రూ. రూ. 450 కోట్లు ఖర్చు చేశారని, తొలుత టూరిజం కోసం అన్నారని, ఆ తర్వాత రాష్ట్రపతి, ప్రధాని కోసమని చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని రాష్ట్రపతి ఎప్పుడూ ఇలాంటి ప్యాలెస్‌లు కోరుకోలేదని తెలిపారు.‘7 బ్లాకులలతో విలావంతమైన భవనాలు కట్టారు. రుషికొండలో 18 ఎకరాల్లో భవనాలు నిర్మించారు. విలాసం కోసం ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఎటు నుంచి చూసినా సముద్రం కనిపించేలా కట్టారు. రాజులు కూడా ఇలాంటివి కట్టుకోలేదేమో. వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్‌లోనూ ఇంత విలాసం లేదు. ఒకప్పుడు రాజులు విలాసవంతమైన భవనాలు కట్టుకునేవాళ్లు. కోర్టులు, కేంద్రాన్ని మభ్య పెట్టి నిర్మాణాలు చేపట్టారు. విచారణ చేపడితే అన్ని బయటకు వస్తాయి.

పేదల పేర్లు చెప్పి విలాసవంతమైన భవనాలు కట్టారు. ఈ భవనాలకు పెట్టిన ఖర్చు రూ. 500 కోట్లను రోడ్లకు పెట్టి ఉంటే గుంతలు ఉండేవి కాదు. రుషికొండ భవనాలను వీడియో తీసి ప్రజలకు అందిస్తాం. భవనాల్లోకి వారిని అనుమతిస్తాం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ నిధులు ఖర్చు పెడితే రోడ్లపై గుంతలు పూడ్చటం పూర్తయ్యేది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికివస్తారా? ప్రజలు ఆలోచించాలి. ఈ భవనాలు అందరికీ చూపిస్తాం. వీటిని దేనికి వాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ కట్టడం ఏమిటో అర్థం కాలేదు. ప్రజలంటే ఎంతో కొంత భయం ఉంటే సమాధానం చెప్పాలి. ప్రజాధనం దోచుకుని గతంలో ఊరికొక ప్యాలెస్‌ కట్టుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారు. విశాఖ ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

First Published:  2 Nov 2024 11:38 AM GMT
Next Story