అన్ని లేఖలు ఒక్కటి కాదు..!
లేఖలో రాసింది అవకాశాల కోసమో, అనుమతుల గురించో కాదు. విజన్ గురించి లీడర్‌షిప్ గురించి.. ఇన్స్పిరేషన్ గురించి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి గురించి..
ముఖ్యమంత్రులకు పారిశ్రామికవేత్తలు లేఖలు రాయడం కొత్తేం కాదు. అయితే లేఖల్లో కొన్ని లేఖలు వేరన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ "ఫాక్స్‌కాన్" చైర్మన్ యంగ్ లియూ రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
సంచలనం ఎందుకంటే.. లేఖ రాసింది ఎవరో ఒక ఆషామాషీ పారిశ్రామికవేత్త కాదు. ఆయన చైర్మన్ గా ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ. ప్రపంచంలో తయారయ్యే ఐఫోన్లలో సగానికి పైగా ఈ కంపెనీలోనే తయారవుతాయి. కంపెనీ టర్న్ ఓవర్ దాదాపు 206 బిలియన్ డాలర్లు!
లేఖలో రాసింది అవకాశాల కోసమో, అనుమతుల గురించో కాదు. విజన్ గురించి లీడర్‌షిప్ గురించి.. ఇన్స్పిరేషన్ గురించి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్‌కి ఉన్న విజన్ తనకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది అని అపూర్వ విజయాలు సాధించిన ఒక అంతర్జాతీయ సంస్థ చైర్మన్ తన లేఖ ద్వారా చెప్పడం కచ్చితంగా సంచలనమే.
Chairman, @HonHai_Foxconn Mr. Young Liu, in a letter addressed to CM Sri KCR, has stated that he was inspired by the vision and efforts of the #Telangana CM towards transformation and development of the State. pic.twitter.com/dJ82MinS14
— Telangana CMO (@TelanganaCMO) March 6, 2023
ఈ లేఖ రాసిన ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలవడానికి ఒక్కరోజు ముందే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు అన్న సంగతి ఆయన రాసిన లేఖకు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.
సంచలనం ఎందుకంటే.. ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో పెడుతున్న పెట్టుబడి మీద సందేహాలు కలిగేలా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ హైదరాబాదులోని కొంగరకలాన్ లో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ లేఖ ద్వారా ప్రకటించడం గర్వకారణం.
తెలంగాణ సీఎం కేసీఆర్ తమ దేశం తైవాన్ కు రావాలని సాదరంగా ఆహ్వానిస్తూ.. కేసీఆర్‌కి ఆతిథ్యం ఇవ్వడం తనకు ఎంతో గౌరవం అని ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లియూ లేఖలో పేర్కొన్నారు.