Telugu Global
Telangana

కుమారీ ఆంటీకి ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా!

మాదాపూర్‌లో ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ యూనియన్‌ ధర్నా చేశారు. కుమారీ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికి పర్మిషన్ ఇచ్చారు.

కుమారీ ఆంటీకి ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా!
X

హైదరాబాద్ మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్, యూనియన్ సభ్యులు ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి కుమారీ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికి పర్మిషన్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంస్థలు జీహెచ్‌ఎంసీ సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కుమారీ ఆంటీకి ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పలంగా మా జీవనాధారాన్ని తొలగిస్తే ఎలా బతుకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే ముఖ్యమంత్రి కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేము హైకోర్టుకు వెళ్లాం.. మా ప్లేసులను మాకిస్తామని అన్నారు. ఇప్పుడు కడీలు పాతి కంచె వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాని గురించి మేము టెంట్లు వేసుకొని నిరసన తెలుపుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇదెక్కడి న్యాయం ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ వాపోయారు. కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు.

First Published:  7 Nov 2024 3:22 PM IST
Next Story