Telugu Global
CRIME

హైదరాబాద్​లో బీదర్‌ దొంగ‌ల కాల్పులు

బీదర్‌ దొంగలు హైదరాబాద్​లో కాల్పులు కలకలం సృష్టించారు.

హైదరాబాద్​లో బీదర్‌ దొంగ‌ల  కాల్పులు
X

కర్ణాటక బీదర్‌లో ఏటీఎం క్వాష్ వ్యానుపై కాల్పులు జరిపిన దుండుగులు హైదరాబాద్‌లోనూ ఘూతుకానికి తెగబడ్డారు. అఫ్జల్‌గంజ్‌లో సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులను చూడగానే బీదర్ దొంగల ముఠా కాల్పులు జరిపారు. అఫ్జల్‌గంజ్‌లో తమ కోసం గాలిస్తున్న బీదర్ పోలీసులను చూసి వారు కాల్పులను పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలను కోల్పోయారు. తరువాత అక్కడి నుంచి తప్పించుకొని ఓ ట్రావెల్స్‌ కార్యాలయంలోకి చొరబడ్డారు.

అక్కడ ట్రావెల్స్ మేనేజర్‌పైనా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం ఇద్దరు సభ్యులున్న ఈ గ్యాంగ్ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.93 లక్షలున్న నగదు​తో పరారయ్యారు.

First Published:  16 Jan 2025 8:39 PM IST
Next Story