Telugu Global
Telangana

హైదరాబాద్‌లోని బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం

మంటలు అంటుకొని ఇప్పటికే పదికిపైగా వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం
X

హైదరాబాద్‌ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. అబిడ్స్‌ పరిధి బొగ్గులకుంటలోని ఓ బాణసంచా దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఎగసిపడుతున్నాయి. పక్కనున్న హోటల్‌కు కూడా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు అంటుకొని ఇప్పటికే పదికిపైగా వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం.

First Published:  27 Oct 2024 10:34 PM IST
Next Story