Telugu Global
Telangana

మాపో రిసోర్స్‌ రికవరీ ప్లాంట్‌ను సందర్శించిన మంత్రుల బృందం

సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్‌ రికవరీ ప్లాంట్‌ను ఈ బృందం పరిశీలించింది.

మాపో రిసోర్స్‌ రికవరీ ప్లాంట్‌ను సందర్శించిన మంత్రుల బృందం
X

సౌత్‌ కొరియా రాజధాని సియోల్‌లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తున్నది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు, జర్నలిస్టులు ఈ బృందంలో ఉన్నారు. సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్‌ రికవరీ ప్లాంట్‌ను ఈ బృందం సందర్శించింది.

మాపో ప్లాంట్‌లో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రిసైక్లింగ్‌ చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల రిసైక్లింగ్‌కు వేస్ట్‌ టు ఎనర్జీ టెక్నాలజీని సియోల్‌ నగరపాలక సంస్థ వాడుతోంది. పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నది. మరో పదేళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుంచి తొలిగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్‌ను నిర్మించడానికి సియోల్‌ నగర పాలక సంస్థ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో మాపో ప్లాంట్‌ పనితీరును పరిశీలించడానికి తెలంగాణ మంత్రుల బృందం అక్కడికి వెళ్లింది.

First Published:  21 Oct 2024 5:37 AM GMT
Next Story