Telugu Global
Telangana

ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదం.. కాంగ్రెస్ నాయకురాలి దుర్మరణం

అటవీ గ్రామమైన పెగడపల్లిలో ప్రచారం నిర్వహించేందుకు ఆమె భర్త, స్తంభంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అయిన రాజయ్యతో కలిసి కారులో బయలుదేరారు.

ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదం.. కాంగ్రెస్ నాయకురాలి దుర్మరణం
X

ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి కాంగ్రెస్ నాయకురాలు దుర్మరణం చెందిన సంఘటన తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలో జరిగింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి కీర్తి బాయి(45) కూడా కొద్ది రోజులుగా పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

గురువారం సాయంత్రం కీర్తి బాయి యామన్‌పల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అటవీ గ్రామమైన పెగడపల్లిలో ప్రచారం నిర్వహించేందుకు ఆమె భర్త, స్తంభంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అయిన రాజయ్యతో కలిసి కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం నిమ్మగూడెం సమీపంలోకి వెళ్లిన తర్వాత మలుపులో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి మట్టి కుప్పను ఢీకొంది.

ఈ ప్రమాదంలో కీర్తి బాయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాహనాన్ని నడుపుతున్న రాజయ్యకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల వారు వెంటనే రాజయ్యను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్ప‌త్రికి తరలించారు. కీర్తి బాయి గత 15 ఏళ్లుగా మహాముత్తారం మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె మృతిపై జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

First Published:  10 May 2024 5:13 AM GMT
Next Story