Telugu Global
Telangana

మొబిలిటీ సెక్టార్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌.. ఇండియాలో మొట్టమొదటి సారి హైదరాబాద్‌లో..

హ్యుందాయ్ కంపెనీకి చెందిన యాక్ససరీస్, ఆటో పార్ట్స్‌ ఇండియా సబ్సిడరీ అయిన హ్యుందాయ్ మోబిస్, బిట్స్ పిలాని, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నాయి.

మొబిలిటీ సెక్టార్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌.. ఇండియాలో మొట్టమొదటి సారి హైదరాబాద్‌లో..
X

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్.. అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశ్రమలకు కేంద్రంగా నిలిచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఐటీ ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయి. ఇక్కడ వసతులు చూసి అనేక గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు హబ్‌గా నిలిచిన హైదరాబాద్.. ఇకపై మొబిలిటీ సెక్టార్‌లో కూడా అగ్రగామిగా మారనున్నది. ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటి మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారింది.

హ్యుందాయ్ కంపెనీకి చెందిన యాక్ససరీస్, ఆటో పార్ట్స్‌ ఇండియా సబ్సిడరీ అయిన హ్యుందాయ్ మోబిస్, బిట్స్ పిలాని, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి ఇవ్వాళ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంవోయూ కుదుర్చుకున్నారు. అత్యాధునిక సాంకేతికతపై పని చేయడం, అందుకు అవసరమైన స్కిల్స్, నాలెడ్జ్‌ను ఇంజినీర్లకు అందించడానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సహకారం అందించనున్నది.

అనేక సంస్థల నుంచి టాలెంట్ కలిగిన ఇంజినీర్లను ఒక దగ్గర చేర్చడం ద్వారా.. మరింత నైపుణ్యం కలిగిన వారిని తయారు చేసే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, నైపుణ్యం పెంపొందించడంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పని చేస్తుందని తెలిపారు. బిట్స్ పిలానీ, మోబిస్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావడం వల్ల రీసెర్చ్, డిజైనింగ్, డెవలప్‌మెంట్ కోర్సులు చేసే విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుందని మంత్రి చెప్పారు.

సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బోధించే పాఠ్య ప్రణాళికలో విస్తృతమైన సబ్జెక్టులు ఉన్నాయని చెప్పారు. అడాస్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమోటీవ్ నెట్‌వర్క్ అండ్ కమ్యునికేషన్, ఆటోమోటీవ్ కంట్రోల్ సిస్టమ్, మెషిన్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆటానమస్ వెహికిల్స్, కనెక్టర్ కార్స్ వంటి అనేక విషయాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఎన్ఆర్ఐ అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, ఐటీ శాఖ సీఆర్వో అమర్‌నాథ్ రెడ్డి, టీ-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తదితరలు పాల్గొన్నారు.


First Published:  5 July 2023 5:06 PM IST
Next Story