Telugu Global
Telangana

బుచ్చమ్మ ఆత్మహత్యపై రేవంత్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలి : కేటీఆర్

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని నగర ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

బుచ్చమ్మ ఆత్మహత్యపై రేవంత్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలి : కేటీఆర్
X

బుచ్చమ్మ ఆత్మహత్యపై సీఎం రేవంత్‌రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కూకట్ పల్లిలో బుచ్చమ్మ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ నగరం మొత్తం బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిందని రేవంత్ రెడ్డి కక్ష కట్టారని మాజీ మంత్రి అన్నారు. బుచ్చమ్మ కుటుంబానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కేటీఆర్ ఆర్ధిక సహాయం చేశారు.

అలాగే హైదరాబాద్ ప్రజలకు తాము అన్ని రకాలుగా అండగా ఉంటామని, హైడ్రాపై న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి రాష్ట్రంలో రాజ్యాంగం ముఖ్యమంత్రి అన్నకి ఒక్క రూల్ పేదలకు వేరే రూల్ ఉంటుందా మాజీ మంత్రి ప్రశ్నించారు. పది నెలల్లో పేదలకు ఒక్క ఇళ్లు అయినా కట్టారా చెప్పాలని నిలదీశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని హైడ్రా భాదితులకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది కేటీఆర్ తెలిపారు.

First Published:  28 Oct 2024 5:34 PM IST
Next Story