కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
సుహాస్ పిర్యాదు మేరకు పోలీసులు వెంకట రెడ్డిపై 506 (నేరపూరిత బెదిరింపులు) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహానీ ఉందని సుహాస్ పిర్యాదులో పేర్కొన్నాడు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చివరకు పోలీసు కేసుల దాకా వెళ్ళాయి. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంకట రెడ్డి, సుహాస్ కు ఫోన్ చేసి ఆయనను, ఆయన తండ్రి సుధాకర్ ను చంపేస్తామని, ఆస్పత్రి కూల్చేస్తామని , వారిని చంపడానికి తన ఫ్యాన్స్ వంద కార్లలో తిరుగుతున్నారని బెదిరించిన విషయం తెలిసిందే. దీనిపై చెరకు సుధాకర్ ఒక వైపు ఏఐసీసీకి పిర్యాదు చేయగా, అతని కుమారుడు సుహాస్ నల్లగొండ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశాడు.
సుహాస్ పిర్యాదు మేరకు పోలీసులు వెంకట రెడ్డిపై 506 (నేరపూరిత బెదిరింపులు) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహానీ ఉందని సుహాస్ పిర్యాదులో పేర్కొన్నాడు. తనను చంపుతానని వెంకట రెడ్డి బెదిరించాడని సుహాస్ ఆరోపించాడు. నల్లగొండ జిల్లా ఎస్పీకి కూడా సుహాస్ ఇదే విషయంపై పిర్యాదు చేశాడు.