Telugu Global
Telangana

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు అయింది.

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు
X

అచ్చంపేట బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు అయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు గువ్వల బాలరాజుపై, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించలేదు పోలీసులు, అధికారులు. ఈ తరుణంలోనే అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు అయింది.పోలీసులతో గువ్వల బాలరాజు మరియు బీఆర్ఎస్ నేతల వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు, గువ్వల బాలరాజు అనుచరుల మధ్య తోపులాట కూడా జరిగింది. దింతో ఆలయం ఎదుటే బైఠాయించారు. గుడిలోపల ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నందున అనుమతించడం లేదని పోలీసులు స్పష్టంచేశారు. పోలీసులు, కాంగ్రెస్‌ నాయకులు కలిసి గువ్వలను బయటకు తోసివేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వెళ్లిపోయిన తర్వాత గువ్వల బాలరాజు దంపతులు ఆలయంలోకి వెళ్లారు. అనంతరం పోలీసుల వైఖరిని నిరసిస్తూ గువ్వల నిరసన తెలిపారు. ఆలయంలోకి వెళ్లకుండా తనపై దాడిచేసిన అచ్చంపేట సీఐ రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని గువ్వల బాలరాజు డిమాండ్‌ చేశారు.

First Published:  16 Jan 2025 2:41 PM IST
Next Story