Telugu Global
Telangana

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై సైతం కేసు నమోదైంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
X

బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనతో పాటు 20 బీఆర్‌ఎస్ నేతలపై సైతం కేసు నమోదైంది. విధులను ఆటంకం కలిగించడన్ని బెదిరింపులకు పాల్పడాన్నిఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసేందుకు వెళ్లారు. ఆయన వచ్చే సమయానికి సీఐ బయటకు వెళ్తున్నారు. అయితే తన ఫిర్యాదును స్వీకరించిన తర్వాత వెళ్లాలని కౌశిక్ రెడ్డి కోరారు.

బంజారాహిల్స్ ఏసీపీకి ఇవాళ ఉదయం ఫోన్‌ చేస్తే 3 గంటలకు రమ్మన్నారని.. తాను స్టేషన్‌కు వెళ్లేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారని.. సీఐ సైతం వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తే తనతో పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారన్నారు. తాను ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారని.. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని సీఐకి ఉంటుందని.. పదవులు లేని సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ స్నేహితుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి.. అక్కడికి పోలీసులను పంపారని.. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారన్నారు. సీఎం రేవంత్‌, శివధర్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందేనని ఆయన డిమాండ్‌ కౌశిక్ రెడ్డి చేశారు.

First Published:  4 Dec 2024 8:28 PM IST
Next Story