కేశవరెడ్డి స్కూల్ లో టీచర్ కొట్టడంతో ఏడేళ్ళ పసివాడు మృతి!
వికారాబాద్ జిల్లా చిలాపూర్ లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఏడేళ్ల కార్తీక్ అనే పసివాణ్ణి ఉపాధ్యాయుడు చితకబాదాడు.దాంతో తీవ్ర అస్వస్తతకు గురైన బాలుడు కింద పడిపోయాడనీ, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని తెలిసింది.
కార్పోరేట్ కాలేజీలు, స్కూళ్ళు చిన్నారుల పట్ల మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. డిప్రెషన్ లోకి కూరుకపోతున్నవారు కొందరైతే, మరి కొందరు యాజమాన్య వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాన్ని ఆహ్వానిస్తున్నారు.
మూడు రోజుల క్రితం హైదరాబాద్ నార్సింగి చైతన్య కాలేజ్ లో సాత్విక్ ఆత్మహత్య ఘటన, నిన్న ఖమ్మం పట్టణంలోని చైతన్య స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న సాయి శరణ్య అనే విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం.... ఈ రోజు ఉపాధ్యాయుడు చితకబాదడంతో వికారాబాద్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో ఓ ఏడేళ్ల పసివాడు మరణం.....
వికారాబాద్ జిల్లా చిలాపూర్ లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఏడేళ్ల కార్తీక్ అనే పసివాణ్ణి ఉపాధ్యాయుడు చితకబాదాడు.దాంతో తీవ్ర అస్వస్తతకు గురైన బాలుడు కింద పడిపోయాడనీ, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని తెలిసింది. స్కూల్ యాజమాన్యం మృతదేహాన్ని చిన్నారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీనిపై కార్తీక్ ఆ తల్లిదండ్రులు చనుమోలు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కార్తీక్ మృతికి ఉపాధ్యాయుడే కారణమని కార్తీక్ తల్లితండ్రులు ఆరోపించారు. కాగా తల్లితండ్రుల ఆరోపణలను పాఠశాల యాజమాన్యం ఖండించింది. బాలుడు కిందపడటం వల్లే గాయాలయ్యాయని వారు చెప్తున్నారు.