Telugu Global
Telangana

80 ఏళ్ల బామ్మ.. 8 కి.మీ. నడక.. ఓ రాఖీ

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొత్తపల్లికి చెందిన బక్కవ్వ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండయ్యపల్లిలో ఉంటున్న తన తమ్మునికి రాఖీ కట్టేందుకు బయల్దేరింది.

80 ఏళ్ల బామ్మ.. 8 కి.మీ. నడక.. ఓ రాఖీ
X

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు ఎంత దూరమైనా వెళ్తారు. రక్షా బంధనం కట్టి తమ అనుబంధాన్ని చాటిచెప్తారు. ఈ రాఖీ పండగకి ఓ 80 ఏళ్ల బామ్మ హైలైట్ అయ్యింది. తమ్ముడిపై ప్రేమతో 8 కిలోమీట‌ర్లు నడుచుకుంటూ వెళ్లి రాఖీ కట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొత్తపల్లికి చెందిన బక్కవ్వ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండయ్యపల్లిలో ఉంటున్న తన తమ్మునికి రాఖీ కట్టేందుకు బయల్దేరింది. తమ ఊరికి 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న తమ్ముడి ఇంటికి నడుచుకుంటూ వెళ్లింది. ఈ రెండు పల్లెల మధ్య రోడ్డు సౌకర్యం లేకపోవడమే బక్కవ్వ నడకకు కారణమట. కాలినడకన తమ్ముడి ఇంటికి వెళ్తున్న బామ్మను అటుగా బైక్ లో వెళ్తున్న ఓ యువకుడు ఆపి ఎక్కడికి పోతున్నవే అవ్వా అని ఆరా తీసిండు. రాఖీ కట్టనీకి మా తమ్ముని కాడికి పోతున్న అని బక్కవ్వ బదులిచ్చింది. ఆ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో బక్కవ్వ పేరు ట్రెండింగ్ అవుతోంది.

First Published:  31 Aug 2023 11:46 AM IST
Next Story