లగచర్ల దాడి ఘటనలో మరో 8 మంది అరెస్ట్
పరిగి పోలీస్ స్టేషన్కు తరలింపు.. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
BY Raju Asari16 Nov 2024 12:54 PM IST
X
Raju Asari Updated On: 16 Nov 2024 12:54 PM IST
లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. మిగతా 16 మందిని పరిగి నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు లగచర్ల ఘటనపై వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీ మహేశ్ భగవత్ వివరాలు సేకరిస్తున్నారు. లగచర్లతో పాటు పరిసర గ్రామాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు ప్రత్యేకు బృందాలతో గాలిస్తున్నారు.
Next Story