నారాయణఖేడ్‌లో బావి నీరు తాగి 50 మందికి అస్వస్థత
బావిలోని నీటిని తాగి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట గ్రామంలో జరిగింది
BY Vamshi Kotas12 Oct 2024 3:39 PM IST

X
Vamshi Kotas Updated On: 12 Oct 2024 3:39 PM IST
బావిలోని నీటిని తాగి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఊరూలోని బీసీ కాలనీ వాసులు స్థానికంగా ఉండే బావిలో నీటిని తాగారు. ఆ వాటర్ తాగిన కొద్దిసేటికే అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు క్షతగాత్రులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరధ పథకం ద్వారా ప్రతి గ్రామాన్నికి మంచి నీరు అందించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న స్కీమ్ అమలు చేయలేక పేద ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది
Next Story