Telugu Global
Telangana

నిన్న ఒక్క రోజే మెట్రోలో 3.5 లక్షల మంది ప్రయాణించారు

నిన్న హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ ప్రియులు ఎక్కువమంది మెట్రో రైళ్ళ మీదనే ఆధారపడ్డారు. నిన్న రాత్రి 1 గంట వరకు రైళ్ళు నడపడంతో నిన్న ఒక్క రోజే మెట్రో రైళ్ళలో 3.5 లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు.

నిన్న ఒక్క రోజే మెట్రోలో 3.5 లక్షల మంది ప్రయాణించారు
X

నిన్న ఒక్క రోజే హైదరాబాద్ మెట్రో రైళ్ళలో 3 లక్షల 50 వేల కన్నా ఎక్కువ మంది ప్రయాణించారు. ఉప్ప ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇం టర్నేషనల్ స్టేడియం లో జరిగిన చివరి టీ20 మ్యాచ్ ను వీక్షించేందుకునగరం లోని నలుమూలల నుం చి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చా రు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది మెట్రో రైళ్ళనే ఉపయోగించారు. వేరే ఊళ్ళనుండి వచ్చిన వాళ్ళు కూడా బస్టాండ్ లో దిగి మెట్రో రైళను ఉపయోగించుకున్నారు.

క్రికెట్ అభిమానుల కోసం మెట్రో రైళ్ళు నిన్న రాత్రి 1గంటవరకు నడిచాయి. దాంతో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున రైళ్ళను వినియోగించుకున్నారు.

మ్యా చ్ మొదలు కావడానికి రెం డు మూడు గం టల నుంచే స్టేడియానికి చేరుకునేం దుకు అభిమానులు పోటెత్తడం తో మెట్రో రైళ్లు సూది దూరేందుకు కూడా సందు లేనంతగా నిండిపోయాయి. ముఖ్యంగా సాయం త్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యమెట్రో స్టేషన్లు అన్నీ కిక్కి రిసిపోయాయి.

ఈ మ్యా చ్ అయిపోయాక కూడా ఇదే పరిస్థితి కనిపించింది. రాత్రి ఒంటి గంటవరకు ఉప్ప ల్, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లు జనాలతో కిటకిటలాడాయి. సెలవు రోజు అయినప్ప టికీ ఆదివారం ఒక్క రోజే ఎల్‌బీ నగర్-మియాపూర్,నాగోలు-రాయదుర్గం రూట్లలో మూడున్నర లక్షల మం ది ప్రయాణిం చినట్లు అధికారులు చెప్తున్నారు.

First Published:  26 Sept 2022 10:53 AM GMT
Next Story