Telugu Global
Telangana

తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు.. రికార్డులు బద్దలు.!

గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో డబ్బు, మద్యం పట్టుబడుతుండటంతో అధికారులు సైతం అవాక్కవుతున్నారు. కేవలం 12 రోజుల వ్యవధిలో రూ.307 కోట్లు..

తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు.. రికార్డులు బద్దలు.!
X

తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.307 కోట్లకు పైగా విలువైన సొత్తును లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. అక్టోబర్‌ 9 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది.

ఇప్పటివరకూ అధికారులు సీజ్ చేసిన వాటిలో రూ.105.58 కోట్ల నగదు, 226.6 కిలోల బంగారం, 894.5 కిలోల వెండి, రూ.146కు విలువైన ఇతర వస్తువులు, రూ.13.58 కోట్ల విలువైన మద్యం, రూ.15.23 కోట్ల విలువైన గంజాయి, రూ.26.93 కోట్ల విలువైన ఇతర వస్తువులు, తాయిలాలు ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.

గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో డబ్బు, మద్యం పట్టుబడుతుండటంతో అధికారులు సైతం అవాక్కవుతున్నారు. కేవలం 12 రోజుల వ్యవధిలో రూ.307 కోట్లు పట్టుపడితే.. ఎన్నికలు ముగిసే నాటికి ఎంత డబ్బు, మద్యం పట్టుబడుతుందనేది ఆశ్చర్యకరంగా మారింది.

First Published:  22 Oct 2023 5:06 AM GMT
Next Story