కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం 306 దరఖాస్తులు.. భట్టి సతీమణి కండీషన్ ఇదే!
ఖమ్మం టికెట్ కోసం చివరిరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, కేంద్రమాజీమంత్రి రేణుకా చౌదరి, మద్ది శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆశావహుల నుంచి విశేష స్పందన వచ్చింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 306 దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఒక్కరోజే ఎంపీ టికెట్ల కోసం దాదాపు 166 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఖమ్మం టికెట్ కోసం చివరిరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, కేంద్రమాజీమంత్రి రేణుకా చౌదరి, మద్ది శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలని లేదంటే తనకే టికెట్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు భట్టి సతీమణి నందిని.
పెద్దపల్లి టికెట్ కోసం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక సికింద్రాబాద్ టికెట్ కోసం ఎం.కోదండరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సామ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ వినయ్ కుమార్ అర్జీ పెట్టుకున్నారు.
ఇక వరంగల్ టికెట్ కోసం పిడమర్తి రవి, సింగర్ రవి దరఖాస్తు చేసుకోగా.. భువనగిరి టికెట్ కోసం శివసేనా రెడ్డి, బండ్రు శోభారాణి, బండి సుధాకర్ గౌడ్, నల్గొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి, పల్లె నారాయణ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నారు. చేవెళ్ల స్థానం కోసం కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, అవేలి దామోదర్, మహబూబబాద్ స్థానం కోసం బానోతు విజయాబాయి, బెల్లయ్యనాయక్, కరీంనగర్ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, రమ్యారావు, మెదక్ స్థానం కోసం బండారు శ్రీకాంత్ రావు చివరి రోజు దరఖాస్తు చేసుకున్నారు.