Telugu Global
Telangana

టూరిస్ట్‌ బస్సును ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి

ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ ఆస్ప‌త్రికి తరలించారు.

టూరిస్ట్‌ బస్సును ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి
X

హైదరాబాద్‌కు చెందిన టూరిస్టు బస్సు ఒడిశాలోని బరిపద వద్ద ప్రమాదానికి గురైంది. బరిపదలో శనివారం తెల్లవారుజామున 18వ నంబరు జాతీయ రహదారిపై బిహార్‌లోని గయకు బయలుదేరిన ఈ బస్సును ఉదయం 5.30 గంటల సమయంలో ట్రక్కు ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ ఆస్ప‌త్రికి తరలించారు.

ఈ బస్సులో హైదరాబాద్‌కు చెందిన 23 మంది పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. డ్రైవర్‌ నిద్రమ‌త్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

First Published:  13 July 2024 11:02 AM IST
Next Story