23 మంది ఐపీఎస్‌ల బదిలీ.. సిద్దిపేట సీపీగా ఎవరంటే..?
టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీగా వి.వి.శ్రీనివాసరావును నియమించింది. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా వి.వి. శ్రీనివాసరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీగా వి.వి.శ్రీనివాసరావును నియమించింది. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా వి.వి. శ్రీనివాసరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, విమెన్ సేఫ్టి వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.
- వి.వి.శ్రీనివాస రావు - టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీ
పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు
-గజారావు భూపాల్ - కో ఆర్డినేషన్ డీఐజీ
-రెమా రాజేశ్వరి - విమెన్ సెఫ్టీ వింగ్ డీఐజీ
-CH. శ్రీనివాస్ - రాజేంద్ర నగర్ డీసీపీ
- ఆర్. వెంకటేశ్వర్లు - హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ - III
- L.S.చౌహాన్ - రామగుండ పోలీస్ కమిషనర్
- సీ.హెచ్. ప్రవీణ్ కుమార్ - ఎల్బీనగర్ డీసీపీ
- డి.ఉదయ్ కుమార్ రెడ్డి - టీఎస్ ట్రాన్స్‌కో ఎస్పీ
- జి.వినీత్ - మాదాపూర్ డీసీపీ
- సునీల్ దత్ - ఖమ్మం పోలీస్ కమిషనర్
- విష్ణు వారియర్ - డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశం
- పి.వి.పద్మజ - డీసీపీ మల్కాజిగిరి
- S. రాజేంద్రప్రసాద్ - సీఐడీ ఎస్పీ
- జోయల్ డేవిస్ - జోగులాంబ గద్వాల డీఐజీ
- గౌష్ ఆలం - ఆదిలాబాద్ ఎస్పీ
- పి.శబరీష్ - ములుగు ఎస్పీ
- నితికా పంత్ - డీసీపీ మేడ్చల్ జోన్
- బి.అనురాధ - సిద్దిపేట పోలీస్ కమిషనర్
- బిరుదురాజు రోహిత్ రాజు - ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం
- బి.బాలస్వామి - మెదక్ ఎస్పీ
- అశోక్ కుమార్ - జయశంకర్ భూపాలపల్లి OSD
- జి.జానకి షర్మిల - నిర్మల్ ఎస్పీ
- జానకి ధరావత్ - సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ