'తెలంగాణలో ఈ ఏడాది నుంచి 2200 అదనపు ఎంబీబీఎస్ సీట్లు, 8 కొత్త మెడికల్ కాలేజీలు'
ఈ ఏడాది నుంచి తెలంగాణలో 2200 అదనపు ఎంబీబీఎస్ సీట్లు, 8 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ప్రకటించారు. విద్యార్థులకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని ఆయన అన్నారు.
దుర్గా అష్టమి, సద్దుల బతుకమ్మ సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య అభ్యసించాలనుకునే వారికి గుడ్ న్యూస్ వినిపించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అదనంగా 2,200 మెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ప్రకటించారు.
"మేము ఈ సంవత్సరం నుండి 8 కొత్త మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లను ప్రారంభిస్తాము, వీటిలో 1200 సీట్లు కొత్తగా వస్తాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ మెడికల్ సీట్లలో 85 శాతం రిజర్వేషన్ ద్వారా 1067 అదనపు ఎంబీబీఎస్ సీట్లతో కలిపి ఈ ఏడాది నుంచి అదనంగా 2,200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని ఎంబీబీఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అందిస్తున్న దసరా కానుక ఇది'' అని టీ హరీశ్‌రావు అన్నారు.
తెలంగాణలో వైద్య విద్య, ఎంబీబీఎస్ ఔత్సాహికులకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని ఆయన అన్నారు.