Telugu Global
Telangana

16 జిల్లాల్లో వందశాతం సమగ్ర సర్వే పూర్తి

13 జిల్లాల్లో 99 శాతం సర్వే.. 20.86 లక్షల నివాసాల సమాచారం కంప్యూటరీకరణ

16 జిల్లాల్లో వందశాతం సమగ్ర సర్వే పూర్తి
X

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే 16 జిల్లాల్లో వంద శాతం పూర్తయ్యిందని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సర్వేతో పాటు సేకరించిన సమాచారం డేటా కంప్యూటరీకరణ వేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడించింది. 13 జిల్లాల్లో సర్వే 99 శాతం పూర్తయ్యిందని బుధవారం వందశాతం సర్వే పూర్తి చేస్తామని తెలిపింది. ఇప్పటి వరకు 20,86,707 ఇండ్ల సర్వే సమాచారాన్ని కంప్యూటరీకరించామని పేర్కొన్నది. రాష్ట్రంలో మొత్తం 1,17,89,076 నివాసాలను సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,10,18,102 ఇండ్ల సమాచారం సేకరించి 93.5 శాతం టార్గెట్‌ పూర్తి చేశామని వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో 25,04,517 ఇండ్ల సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 19,62,950 ఇండ్ల నుంచి సమాచారం సేకరించామని తెలిపింది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఎన్యూమరేటర్‌ దగ్గరుండి డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తో నమోదు చేయించాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నది.

First Published:  26 Nov 2024 9:22 PM IST
Next Story