Telugu Global
Telangana

టీఎస్ఆర్టీసీ 100 డేస్ ఫెస్టివల్ ఛాలెంజ్

తెలంగాణలో ఇటీవల కాలంలో ఉద్యోగులకు రాఖీ పండగ ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ అనే టాస్క్ లు ఇచ్చామని.. అందరూ నిబద్ధతతో పనిచేసి సంస్థకు ఆదాయం పెంచారని అభినందించారు సజ్జనార్.

టీఎస్ఆర్టీసీ 100 డేస్ ఫెస్టివల్ ఛాలెంజ్
X

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 100 డేస్ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ విసిరారు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. రాబోయే వందరోజుల్లో దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగలు ఉన్నాయని.. ఆ పండగల సందర్భంగా ఎక్కువమంది ప్రయాణికులకు సేవలందించాలని ఉద్యోగులకు సూచించారు. అక్టోబర్ 15 నుంచి 2024 జనవరి 22 వరకు ఈ ఛాలెంజ్ అమలులో ఉంటుందన్నారు. ఈ ఛాలెంజ్ ని విజయవంతంగా పూర్తి చేయాలని ఉద్యోగులకు ఉపదేశమిచ్చారు సజ్జనార్.

ఛాలెంజ్ ఏదయినా.. విజయం మనదే

తెలంగాణలో ఇటీవల కాలంలో ఉద్యోగులకు రాఖీ పండగ ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ అనే టాస్క్ లు ఇచ్చామని.. అందరూ నిబద్ధతతో పనిచేసి సంస్థకు ఆదాయం పెంచారని అభినందించారు సజ్జనార్. ఈ సందర్భంగా మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. మొత్తం 286మంది ఆర్టీసీ సిబ్బందికి అవార్డులు ఇచ్చారు.

వినూత్న కార్యక్రమాలు, ఆఫర్లతో టీఎస్ఆర్టీసీ ప్రజలకు మరింతగా చేరువైందని తెలిపారు సజ్జనార్. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక, ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఆర్టీసీ సంస్థ సత్పలితాలు సాధిస్తోందన్నారు. గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు సజ్జనార్. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు. రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులోనే ఆర్టీసీకి రూ.22.65 కోట్ల రాబడి రావడం విశేషం అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత మొత్తంలో ఒకరోజు ఆదాయం రాలేదన్నారు. తాజాగా 100 డేస్ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ని ప్రకటించారు సజ్జనార్.

First Published:  7 Oct 2023 4:14 PM GMT
Next Story