ఐటీఈఎస్ రంగంలో 10వేల ఉద్యోగాలు.. హైదరాబాద్‌కు రానున్న వీఎక్స్ఐ గ్లోబల్
హైదరాబాద్‌లో తమ కంపెనీకి చెందిన కార్యాలయాన్ని ప్రారంభించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఒప్పందం చేసుకున్నారు. దీని వల్లు ఐటీఈఎస్ రంగంలో 10వేల ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) రంగంలో హైదరాబాద్‌కు ఊతమిచ్చేలా మరో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడింది. అమెరికాకు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో వీఎక్స్ఐ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ ఎరికా బోగర్ కింగ్ భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లో తమ కంపెనీకి చెందిన కార్యాలయాన్ని ప్రారంభించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఒప్పందం చేసుకున్నారు. దీని వల్లు ఐటీఈఎస్ రంగంలో 10వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే ఇక్కడ అనేక ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇండియాలో ఐటీ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ నగరానికి.. వీఎక్స్ఐ గ్లోబల్ రావడంతో యువతకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
బైన్ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ సంస్థ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సొల్యూషన్స్‌లో మంచి అనుభవం కలిగి ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియా, యూరోప, కరేబియన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వీఎక్స్ఐ గ్లోబల్.. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించడానికి ఒప్పందం కుదుర్చుకున్నది.
Another Massive new addition to the rocking Hyderabad ITES sector!
— KTR (@KTRBRS) May 21, 2023
A Bain Capital Owned company, @vxiglobal, leading provider of customer experience solutions, with presence in 42 locations across North America, Latin America, Asia, Europe, and the Caribbean, makes a grand… pic.twitter.com/vLBw10kVnL