Telugu Global
Telangana

బ్యాంక్ ఆఫ్ మ‌హ‌రాష్ట్రకు టోకరా కేసులో 10 మందికి జైలు

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సికింద్రాబాద్‌ బ్రాంచ్‌ అప్పటి సీనియర్‌ మేనేజర్‌ జల్లి శరత్‌బాబు, ఇతర బ్యాంకు అధికారి రాందాసి సుహాస్ క‌ళ్యాణ్‌లు ప్రైవేటు కంపెనీకి చెందిన వ్యక్తులతో కలిసి కుట్ర చేశారు. రూ. 5 కోట్ల రుణ మంజూరు కోసం నకిలీ పత్రాలను సృష్టించారు.

బ్యాంక్ ఆఫ్ మ‌హ‌రాష్ట్రకు టోకరా కేసులో 10 మందికి జైలు
X

సికింద్రాబాద్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర బ్రాంచ్‌లో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై నిధుల మళ్లింపు, రుణాలు మంజూరు చేసిన కేసులో ఇద్ద‌రు బ్యాంకు అధికారుల‌తోపాటు, ఎనిమిది మందికి హైద‌రాబాద్‌లోని సిబిఐ కోర్టు జైలుశిక్ష‌తో పాటు, జ‌రిమానా విధించింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర సికింద్రాబాద్‌ బ్రాంచ్‌ అప్పటి సీనియర్‌ మేనేజర్‌ జల్లి శరత్‌బాబు, ఇతర బ్యాంకు అధికారి రాందాసి సుహాస్ క‌ళ్యాణ్‌లు ప్రైవేటు కంపెనీకి చెందిన వ్యక్తులతో కలిసి కుట్ర చేశారు. రూ. 5 కోట్ల రుణ మంజూరు కోసం నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ న‌కిలీ ప‌త్రాల‌ను హామీగా పెట్టుకుని బ్యాంకు అధికారులు వెంట‌నే రూ.5 కోట్ల మంజూరు చేశారు. దీనిపై 2013లో సిబిఐ కేసు నమోదు చేసింది. నేరం రుజువు కావడంతో బ్యాంకు అధికారులు జెల్లి శరత్‌బాబు, రాందాసి సుహాస్‌ కళ్యాణ్‌కు ఏడేళ్ల జైలు, ల‌క్షా ప‌దివేల రూపాయ‌ల‌ జరిమానా విధించారు. ఈ కేసులో దొనికెన శ్రీధర్‌, దొనికెన పూర్ణశ్రీ, మారెళ్ల శ్రీనివాస్‌ రెడ్డికి ఏడేళ్ల జైలు.. లక్ష రూపాయ‌ల‌ చొప్పున జరిమానా విధించారు. మరో నిందితుడు మారెళ్ల లక్ష్మారెడ్డికి ఏడాది జైలు శిక్ష‌, రూ.20 వేల జరిమానా, వెంపటి శ్రీనివాస‌రెడ్డి, వెట్టె రాజారెడ్డి, వడ్డె నర్సయ్య, బాతుల సత్యసూరజ్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.

First Published:  24 Nov 2022 3:40 PM IST
Next Story