వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటనలో 15 మందిపై కేసు
వికారాబాద్ దాడి ఘటనలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టబోమని ఐజీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం దాడి ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.
BY Vamshi Kotas11 Nov 2024 3:40 PM GMT
X
Vamshi Kotas Updated On: 11 Nov 2024 3:40 PM GMT
వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడి ఘటనలో ఎంతటి వారు ఉన్నా వదిలి పెట్టబోమని ఐజి వెల్లడించారు. వారి మొబల్ ఫోన్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తామని అన్నారు. ప్రస్తుతం దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు ప్రేరేపించారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. బయటినుంచి వచ్చిన వారు కూడా దాడిలో పాల్గొన్నారని అన్నారు. ఎవరినీ వదిలిపెట్టమని.. అందరినీ గుర్తించి చర్యలు తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. అదనపు కలెక్టర్, కడా చైర్మన్, డీఎస్పీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అదనపు కలెక్టర్‌పై గ్రామస్తులు, రైతులు రాళ్లు విసిరి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాలలో జరిగింది.
Next Story