Telugu Global
Telangana

ఎమ్మెల్యేల 'అనర్హత'పై విచారణ 11వ తేదీకి వాయిదా

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది

ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ 11వ తేదీకి వాయిదా
X

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మోహన్‌ రావు వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీల్‌ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్కు విచారణ అర్హత లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను మోహన్‌ రావు చదవి వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సెప్టెంబర్‌ 9న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహాచార్యులు వేర్వేరుగా రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె. శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం కూడా విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్ల బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ .. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం అనర్హత పిటిషన్లపై విచారణను ట్రిబ్యునల్ ఛైర్మన్‌ హోదాలో చేపడుతారు. ట్రిబ్యునల్‌ న్యాయవ్యవస్థలో భాగమేనని, దీని విధులను పర్యవేక్షించే అధికారం కోర్టులకు ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపును ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఒక్క రోజు కూడా కొనసాగరాదన్నారు. గతంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదన్న కారణంగా ఇప్పడు తీసుకోబోమన్న వాదన సరికాదన్నారు. ఒకరు తప్పు చేస్తే తాము అదే కొనసాగిస్తామనడం చెల్లదన్నారు. స్పీకర్‌ విధులను నిర్వహించడంలో విఫలమైనప్పుడు రాజ్యాంగ కోర్టులు జోక్యం తప్పదన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో దానం నాగేందర్‌ పోటీ చేశారన్నారు. దీనిపై ఆన్‌లైన్‌ అనర్హత పిటిషన్లు దాఖలు చేస్తే స్వీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించమన్నారు. కోర్టు ఆదేశాలతోనే అనర్హత పిటిషన్లను స్వీకరించారన్నారు. కేశం మెగా చంద్రసింగ్‌ కేసులో నిర్ణీత గడువులోగా స్పీకర్‌ నిర్ణక్ష్మీం తీసుకోవాలని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాదులు డి. ప్రకాశ్‌రెడ్డి, బి. మయూర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ స్పీకర్‌ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. దీనికి సంబంధించి పలు సుప్రీం కోర్టులు తీర్పులను ప్రస్తావించారు. గురు, శుక్రవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.

First Published:  8 Nov 2024 6:34 PM IST
Next Story