Telugu Global
Sports

ప్రపంచ మహిళా ఫుట్ బాల్ లో సెమీస్ వార్!

2023 ఫిఫా ప్రపంచ మహిళా ఫుట్ బాల్ లో సరికొత్త చాంపియన్ ఆవిష్కరణకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈరోజు జరిగే సెమీఫైనల్స్ లో స్పెయిన్ తో స్వీడన్, ఇంగ్లండ్ తో ఆస్ట్ర్రేలియా ఢీ కొనబోతున్నాయి.

ప్రపంచ మహిళా ఫుట్ బాల్ లో సెమీస్ వార్!
X

2023 ఫిఫా ప్రపంచ మహిళా ఫుట్ బాల్ లో సరికొత్త చాంపియన్ ఆవిష్కరణకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈరోజు జరిగే సెమీఫైనల్స్ లో స్పెయిన్ తో స్వీడన్, ఇంగ్లండ్ తో ఆస్ట్ర్రేలియా ఢీ కొనబోతున్నాయి.

ఆస్ట్ర్రేలియ, న్యూజిలాండ్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2023 పిఫా ప్రపంచకప్ మహిళా ఫుట్ బాల్ పోటీలు రసపట్టుగా సాగుతున్నాయి. గత టోర్నీ వరకూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, నార్వే, అర్జెంటీనా లాంటిజట్లు క్వార్టర్ ఫైనల్స్ దశలోనే ఇంటిదారి పట్టడంతో..సరికొత్త చాంపియన్ ఎవరో కొద్దిరోజుల్లో తేలిపోనుంది.

స్వీడన్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, స్పెయిన్ జట్లు సెమీఫైనల్స్ చేరుకోడంతో అసలుసిసలు నాకౌట్ పోరుకు రంగం సిద్ధమయ్యింది.

తొలిసారిగా సెమీస్ లో ఆస్ట్ర్రేలియా...

ఆతిథ్య ఆస్ట్ర్రేలియాజట్టు అందరి అంచనాలు తలకిందులు చేసి తొలిసారిగా సెమీఫైనల్స్ చేరుకోడం ద్వారా సంచలనం సృష్టించింది. స్టార్ ప్లేయ్ సామ్ కెర్ గాయంతో

జట్టు నుంచి వైదొలగినా కంగారూ మహిళాజట్టు సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకుపోగలిగింది.

గ్రూపులీగ్ దశలో ఒలింపిక్ చాంపియన్ కెనడా, డెన్మార్క్ జట్లను కంగు తినిపించిన ఆస్ట్ర్రేలియా క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటౌట్ విజయంతో మొదటిసారిగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది

హాట్ ఫేవరెట్ గా ఇంగ్లండ్...

యూరోపియన్ చాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత మహిళా ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగింది. అంచనాలకు తగ్గట్టుగా ఆడుతూ సెమీస్ కు అర్హత సంపాదించింది. లారెన్ జేమ్స్ లాంటి కీలక ప్లేయర్ అందుబాటులో లేకున్నా ఇంగ్లండ్ నెగ్గుతూ వస్తోంది.

ఫైనల్లో చోటు కోసం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది.

అనూహ్యంగా సెమీస్ లో స్పెయిన్...

15 మంది ప్రధాన ప్లేయర్లు టోర్నీలో పాల్గొనటానికి ఆసక్తి చూపక పోయినా..అందుబాటులో ఉన్న ప్లేయర్లతోనే స్పెయిన్ సెమీస్ కు దూసుకురాగలిగింది.

లీగ్ దశలో లాటిన్ అమెరికాకు చెందిన కోస్టారికా, ఆఫ్రికన్ థండర్ జాంబియాజట్లను అధిగమించిన స్పెయిన్ కు జపాన్ చేతిలో 1-2 గోల్స్ పరాజయం ఎదురైనా

క్వార్టర్ ఫైనల్లో 2-1తో నెదర్లాండ్స్ పై సంచలన విజయం ద్వారా తొలిసారిగా సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది. 2011 ప్రపంచకప్ ఫుట్ బాల్ విజేత జపాన్ ను ఇంటిదారి పట్టించడంలో స్పెయిన్ సఫలం కాగలిగింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే తొలి సెమీఫైనల్లో పవర్ ఫుల్ స్వీడన్ తో తలపడనుంది.

టాప్ గేర్ లో స్వీడన్...

రికార్డుస్థాయిలో ఐదోసారి ప్రపంచ మహిళా ఫుట్ బాల్ సెమీస్ చేరిన స్వీడన్ జట్టు టైటిల్ గెలుచుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోల్ కీపర్ జిసీరా ముజోవిచ్, డిఫెండర్ అమండా ఇల్ స్టెడ్ తమజట్టుకు కొండంత అండగా ఉంటూ సెమీస్ వరకూ రావడంలో ప్రధానపాత్ర వహించారు.

లీగ్ దశలో దక్షిణాఫ్రికా, ప్రపంచ మాజీ చాంపియన్ అమెరికాలను కంగు తినిపించిన స్వీడన్...కీలక క్వార్టర్ ఫైనల్లో మరో మాజీ చాంపియన్ జపాన్ ను అధిగమించడం ద్వారా వరుసగా రెండోసారి సెమీస్ చేరుకొంది.

ఈరోజు జరిగే తొలి క్వార్టర్ ఫైనల్స్ లో స్పెయిన్ తో స్వీడన్ పోటీపడనుంది. స్వీడన్- స్పెయిన్, ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియాజట్ల సెమీస్ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయమని సాకర్ పండితులు చెబుతున్నారు.

ప్రపంచ మేటిజట్లన్నీ క్వార్టర్ ఫైనల్స్ దశలోనే నిష్క్ర్రమించడంలో..ఇప్పటి వరకూ విశ్వవిజేతగా నిలువని స్పెయిన్, ఇంగ్లండ్, స్వీడన్, ఆస్ట్ర్రేలియాజట్లలో ఏ జట్టు..సరికొత్త ప్రపంచ చాంపియన్ గా అవతరిస్తుందో తెలుసుకోవాలంటే..కొద్దిరోజులపాటు ఈ వారాంతం వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  15 Aug 2023 4:00 PM IST
Next Story