మహిళా టీ-20 ప్రపంచకప్ ఏడాది వాయిదా!
దక్షిణాఫ్రికా వేదికగా వచ్చేనెలలో జరగాల్సిన మహిళా టీ-20 ప్రపంచకప్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
దక్షిణాఫ్రికా వేదికగా వచ్చేనెలలో జరగాల్సిన మహిళా టీ-20 ప్రపంచకప్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. పలు అంతర్జాతీయ టోర్నీలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహిళా క్రికెటర్ల పై ఒత్తిడి తగ్గించటానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఐసీసీ వివరించింది....
ఆస్ట్ర్రేలియా వేదికగా ఈనెల 16 నుంచి జరుగనున్న 2022 టీ-20 ప్రపంచకప్ ఏర్పాట్లలో ఓవైపు తలమునకలైన ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) వచ్చేనెలలో నిర్వహించాల్సిన మహిళా టీ-20 ప్రపంచకప్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొంది.
దక్షిణాఫ్రికా వేదికగా 2022 నవంబర్ లో జరగాల్సిన మహిళా ప్రపంచకప్ ను 2023 ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నట్లు సభ్యదేశాల క్రికెట్ బోర్డులకు ఐసీసీ సమాచారం పంపింది.
మహిళా క్రికెట్ బాగు కోసమే....
న్యూజిలాండ్ వేదికగా ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించాల్సిన 50 ఓవర్ల ఐసీసీ ప్రపంచకప్ ను ఇప్పటికే వాయిదా వేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి..టీ-20 ప్రపంచకప్ ను సైతం వాయిదా వేయటానికి దారితీసిన పరిస్థితులను వివరించింది.
బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా తొలిసారిగా మహిళలకు నిర్వహించిన టీ-20 టోర్నీలో తలపడిన ప్రధానజట్లు..వచ్చే కొద్దివారాల సమయంలో మరిన్ని అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొనాల్సి ఉందని, దీనికితోడు పలు ద్వైపాక్షిక సిరీస్ ల్లో సైతం తలపడనున్న కారణంగా మహిళా క్రికెటర్లపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా..
టీ-20 ప్రపంచకప్ ను 2022 నవంబర్ కు బదులుగా 2023 ఫిబ్రవరి 9 నుంచి 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
మహిళాక్రికెట్ కు ..ప్రధానంగా టీ-20 ప్రపంచకప్ కు తగిన ప్రాచుర్యం కల్పించడానికే వాయిదా వేసినట్లు ఐసీసీ సీఈవో మను స్వాహ్నీ తెలిపారు. పురుషుల క్రికెట్ కు లభిస్తున్న ఆదరణ మహిళాక్రికెట్ కు లభించకపోడంతో ఐసీసీ ఆచితూచి నిర్ణయాలు తీసుకొంటోంది.
మహిళా టోర్నీల నిర్వహణ పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతో పాటు..క్రికెటర్లపై ఒత్తిడి తగ్గించటమూ ముఖ్యమని ఐసీసీ వివరించింది.