Telugu Global
Sports

భారత తొలి క్రికెటర్ గా విరాట్ కొహ్లీ రికార్డు!

గౌహతీలోని బార్సపారా స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన హైస్కోరింగ్ రెండో టీ-20 పోరులో విరాట్ 49 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. కేవలం 22 బాల్స్ లోనే 7 ఫోర్లు, ఓ సిక్సర్ తో 49 పరుగులు సాధించాడు.

భారత తొలి క్రికెటర్ గా విరాట్ కొహ్లీ రికార్డు!
X

అంతర్జాతీయ క్రికెట్లో భారత ఆధునిక పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. గౌహతీ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ ద్వారా విరాట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు...

అంతర్జాతీయ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ పడిలేచిన కెరటంలా దూసుకుపోతున్నాడు. గత మూడేళ్లుగా పరుగులకు, శతకాలకు దూరమైన విరాట్ ...ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ ద్వారా తిరిగి పుంజుకోగలిగాడు. 36 మాసాల క్రితం నిలిచిపోయిన తన పరుగుల వేటను తిరిగి కొనసాగించగలుగుతున్నాడు.

ఆసియాకప్, ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ టీ-20 సిరీస్ తో పాటు...దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ ద్వారా విరాట్ బ్యాటింగ్ తిరిగి గాడిలో పడింది.

ఒకే ఒక్కడు విరాట్ కొహ్లీ...

గౌహతీలోని బార్సపారా స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన హైస్కోరింగ్ రెండో టీ-20 పోరులో విరాట్ 49 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. కేవలం 22 బాల్స్ లోనే 7 ఫోర్లు, ఓ సిక్సర్ తో 49 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ..టీ-20 ఫార్మాట్లో 11000 పరుగులు సాధించిన భారత తొలి, ఏకైక, ఒకేఒక్క బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత సిరీస్ లోని రెండో టీ-20 వరకూ మొత్తం 354 మ్యాచ్ లు ఆడిన విరాట్ 11వేల పరుగుల మైలురాయిని చేరగలిగాడు. ఐపీఎల్ లో 5, అంతర్జాతీయ టీ-20ల్లో 1 శతకంతో సహా మొత్తం 6 సెంచరీలు, 77 అర్థశతకాలు ఉన్నాయి.

అత్యంత వేగంగా 10వేల పరుగుల రికార్డు...

విరాట్ గత సీజన్లోనే అంతర్జాతీయ, దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌ మ్యాచ్ లు కలుపుకొని కేవలం 314 మ్యాచ్‌ల్లోనే 10వేల పరుగుల రికార్డును విరాట్‌ సాధించాడు. భారత్‌ తరపున 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కిన విరాట్‌.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడిగా నిలిచాడు. గతంలోనే ఈ ఘనత సాధించిన మొనగాళ్లలో క్రిస్‌ గేల్‌ (14,275), పొలార్డ్‌ (11, 195), షోయబ్‌ మాలిక్‌ (10, 808), వార్నర్‌ (10, 019) ముందున్నారు.

ఈనెల 16న ఆస్ట్ర్రేలియా వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ భారత్ టాపార్డర్ కు కీలకం కానున్నాడు.

First Published:  3 Oct 2022 1:41 PM IST
Next Story