Telugu Global
Sports

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కింద అమెరికాలో అరెకరం భూమి

టోర్నీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రూథర్‌ఫర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీతోపాటు అర ఎకరం భూమి అదించారు.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కింద అమెరికాలో అరెకరం భూమి
X

వెస్టిండీస్ యువ క్రికెటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్ జాక్ పాట్ కొట్టేశాడు. ఒక టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కింద.. అర ఎకరం భూమిని గెలుచుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ఘనత సాధిస్తే ఖరీదైన కారో, బైకో అందిస్తారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అర ఎకరం భూమి బహుమతిగా ఇవ్వడంతో రూథర్‌ఫర్డ్‌తో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ అర ఎకరం భూమి కూడా అమెరికాలో ఇవ్వనుండటం ఇక్కడ మరో విశేషం.

కెనడాలో జరిగి గ్లోబల్ టీ20 మూడో సీజన్‌లో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ అద్భుతంగా రాణించాడు. తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించడమే కాకుండా అభిమానులను కూడా అలరించాడు. టోర్నీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రూథర్‌ఫర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీతోపాటు అర ఎకరం భూమి అదించారు. విండీస్ దిగ్గర ప్లేయర్ క్లైవ్ లాయిడ్ ఈ మేరకు అవార్డును రూథర్‌ఫర్డ్‌కు అందించారు.

కెనడాలోని ఒంటారియోలో జూలై 20 నుంచి ఆగస్టు 6 వరకు గ్లోబల్ టీ20 కెనడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్‌లో సర్రే జాగ్వర్స్‌పై ది మాంట్రియల్ టైగర్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీ ఆసాంతం రూథర్‌ఫర్డ్ అద్బుతంగా రాణించాడు. దీంతో అతడిని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక చేశారు.


First Published:  7 Aug 2023 6:09 PM IST
Next Story