Telugu Global
Sports

హృద‌యాల‌ను హ‌త్తుకునేలా.. కెప్టెన్ కూల్ నిర్ణ‌యం.. - ఐపీఎల్ ట్రోఫీ అందుకునే చాన్స్ జ‌డేజా, రాయుడుల‌కు

ఫైన‌ల్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జ‌డేజా, త‌న అద్భుత బ్యాటింగ్‌తో జ‌ట్టు విజ‌యానికి దోహ‌ద‌ప‌డట‌మే గాక ఆఖ‌రి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రాయుడుల‌ను అందుకోవాల‌ని కోరాడు.

హృద‌యాల‌ను హ‌త్తుకునేలా.. కెప్టెన్ కూల్ నిర్ణ‌యం.. - ఐపీఎల్ ట్రోఫీ అందుకునే చాన్స్ జ‌డేజా, రాయుడుల‌కు
X

చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ సాధించిన కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అభిమానుల హృద‌యాల‌ను హ‌త్తుకునే నిర్ణ‌యం తీసుకున్నాడు. ఐపీఎల్ ట్రోఫీని తాను అందుకోకుండా ఫైన‌ల్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జ‌డేజా, త‌న అద్భుత బ్యాటింగ్‌తో జ‌ట్టు విజ‌యానికి దోహ‌ద‌ప‌డట‌మే గాక ఆఖ‌రి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రాయుడుల‌ను అందుకోవాల‌ని కోరాడు. త‌ద్వారా వారికి అరుదైన గౌర‌వాన్ని అందించాడు. దీంతో జడేజా, రాయుడు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నుంచి ట్రోఫీని స్వీకరించారు.

రాయుడులో ప్ర‌త్యేక‌త‌ల‌ను వివ‌రించిన ధోనీ..

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం ధోనీ అంబ‌టి రాయుడు గురించి మాట్లాడుతూ.. రాయుడులో ప్రత్యేకత ఏంటంటే.. అతడు మైదానంలో ఉంటే నూరుశాతం శ్రమిస్తాడు.. అంటూ ప్ర‌శంసించాడు. రాయుడు జ‌ట్టులో ఉంటే తానెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు గెల‌వ‌ని కూడా చెప్పాడు. ఎందుకంటే రాయుడు చాలా త్వరగా స్పందిస్తాడని, అతడో మంచి క్రికెటర్‌గా త‌న‌కు గుర్తుండిపోతాడని వివ‌రించాడు. ఎప్పుడూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాడని, టీమిండియాకు ఆడే రోజుల నుంచి చూస్తున్నా.. అతడు స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్లను సమర్థంగా ఎదుర్కోగలడు.. అని తెలిపాడు. ఫైనల్లో కేవలం 8 బంతుల్లో 19 పరుగులు చేసిన రాయుడు చెన్నై విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ అద్భుత ప్ర‌యాణం 3 ద‌శాబ్దాలు సాగుతుంద‌ని ఊహించ‌లేదు..

ఫైనల్ అనంతరం రాయుడు మాట్లాడుతూ.. అన్ని రకాల క్రికెట్ నుంచి తాను రిటైరవుతున్నట్టు చెప్పాడు. చిన్నప్పుడు ఇంటి వద్ద క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పుడు టెన్నిస్ బంతితో ఆడేవాడిన‌ని, ఈ అద్భుత ప్రయాణం మూడు దశాబ్దాలు సాగుతుందని ఊహంచలేదని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. అండర్-15 నుంచి అత్యున్నత స్థాయి వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాన‌ని వివ‌రించాడు. తొలిసారి 2013లో టీమ్ ఇండియా క్యాప్ అందుకోవడం త‌న‌కిప్పటికీ గుర్తుందని చెప్పాడు.

First Published:  31 May 2023 9:23 AM IST
Next Story