నేడే భారత్-న్యూజిలాండ్ తొలివన్డే!
జార్ఖండ్ లోని రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు తీన్మార్ సిరీస్ లోని తొలి టీ-20 సమరం ప్రారంభంకానుంది.
భారత్- న్యూజిలాండ్ జట్ల మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు జార్ఖండ్ లోని రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. టాప్ ర్యాంకర్ భారత్ కు 5వ ర్యాంకర్ న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.
భారత్ లో న్యూజిలాండ్ జట్టు జంట సిరీస్ ల వేట రెండోదశకు చేరింది. తొలిదశ వన్డే సిరీస్ లో 0-3తో భారత్ చేతిలో చిత్తుగా ఓడటంతో పాటు..ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం కోల్పోయిన న్యూజిలాండ్...రెండోదశ టీ-20 సిరీస్ లో భారత్ పని పట్టాలన్న పట్టుదలతో ఉంది.
జార్ఖండ్ లోని రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు తీన్మార్ సిరీస్ లోని తొలి టీ-20 సమరం ప్రారంభంకానుంది.
తుదిజట్టులో పృథ్వీకి చోటు లేనట్లే!
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, రాహుల్ లాంటి పలువురు సీనియర్ స్టార్లు వేర్వేరు కారణాలతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో..యువఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వంలో యువఆటగాళ్లతో కూడిన జట్టుతోనే భారత్ పోటీకి దిగుతోంది.
ప్రస్తుతం శుభ్ మన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని, పృథ్వీ తనవంతు కోసం వేచిచూడక తప్పదని కెప్టెన్ హార్థిక్ పాండ్యా మీడియా సమావేశంలో స్పష్టం చేశాడు.
దీనికితోడు వైస్ కెప్టెన్, మిస్టర్ -360 షాట్ మేకర్, ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ ఈ మ్యాచ్ కే ప్రధాన ఆకర్షణ కానున్నాడు.
ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉన్న భారత్ కు స్వదేశంలో తిరుగులేని జట్టుగా పేరుంది.
డాషింగ్ ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాలతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
బౌలింగ్ లో స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్ , పేస్ విభాగంలో అర్షదీప్ సింగ్, శివం మావీ, ఉమ్రాన్ మాలిక్, పాండ్యా ప్రధానపాత్ర పోషించబోతున్నారు.
ప్రమాదకరమైన జట్టు న్యూజిలాండ్..
మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ సాంట్నర్ నాయకత్వంలోని న్యూజిలాండ్ ను తక్కువగా అంచనా వేస్తే భారత్ కు గట్టి షాక్ తప్పదు. సూపర్ హిట్టర్లు మిషెల్ బ్రేస్ వెల్, గ్లెన్ ఫిలిప్స్, డేవన్ కాన్వే, ఫిన్ అలెన్ లతో కివీ బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. లెగ్ స్పిన్నర్ ఇష్ సోథీ, కెప్టెన్ సాంట్నర్ కీలకపాత్ర పోషించనున్నారు.
స్లో వికెట్ గా పేరుపొందిన రాంచీ పిచ్ పైన స్లోమీడియం బౌలర్లు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భారత్ వేదికగా జరిగిన గత టీ-20 సిరీస్ లో 0-3తో ఘోరపరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ..ప్రస్తుత సిరీస్ లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలన్న పట్టుదలతో ఉంది.
రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో మంచుప్రభావం కూడా తుదిఫలితం నిర్ణయించడంలో కీలకంకానుంది.