Telugu Global
Sports

భారత క్రికెటర్లకు మూడురోజుల 'పండుగ' సెలవులు!

వన్డే ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెటర్లకు మూడురోజుల పండుగ సెలవులు ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

భారత క్రికెటర్లకు మూడురోజుల పండుగ సెలవులు!
X

వన్డే ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెటర్లకు మూడురోజుల పండుగ సెలవులు ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

గత ఎనిమిదివారాలుగా నాన్ స్టాప్ క్రికెట్ ఆడుతూ వస్తున్న రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు మూడురోజులపాటు సెలవులు ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న 2023 ఐసీసీవన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఐదుకు ఐదురౌండ్ల మ్యాచ్ లు నెగ్గడం ద్వారా టాపర్ గా నిలిచిన

భారతజట్టు సభ్యులు తమ కుటుంబసభ్యులతో మూడురోజుల గడపటానికి న్యూఢిల్లీ నుంచి స్వస్థలాలకు చేరుకొన్నారు.

7 రోజుల విరామంతోనే 3 రోజుల బ్రేక్...

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా శ్రీలంక వేదికగా జరిగిన ఆసియాకప్ నుంచి గత 8 వారాలుగా విసుగు విరామం లేకుండా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ వస్తున్న

భారత క్రికెటర్లకు అనుకోకుండా 7 రోజుల విరామం దొరకడంతో మూడురోజులపాటు బ్రేక్ ఇవ్వాలని బీసీసీఐ భావించింది.

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన 5వ రౌండ్ మ్యాచ్ కు...ఇంగ్లండ్ తో లక్నో వేదికగా ఈనెల 29న ఆడాల్సిన 6వ రౌండ్ మ్యాచ్ కు నడుమ 7 రోజుల విరామం దొరికింది.

దీంతో..తమ ఆరవ రౌండ్ మ్యాచ్ లో పాల్గొనటానికి ముందు మూడురోజులపాటు తమ తమ కుటుంబసభ్యులతో గడిపి రావటానికి సెలవులు ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

లక్నోలో తిరిగి కలువనున్న రోహిత్ సేన...

మూడురోజుల సెలవలతో తమ స్వస్థలాలకు వెళ్లిన భారత క్రికెట్ సభ్యులు తిరిగి అక్టోబర్ 26న లక్నోలో సమావేశం కావాల్సి ఉంది. ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా భారత్ తన 6వ రౌండ్ మ్యాచ్ ను లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈనెల 29న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో జరిగే పోరులో తలపడాల్సి ఉంది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ సెమీఫైనల్స్ చేరాలంటే మిగిలిన నాలుగు రౌండ్ల మ్యాచ్ ల్లో కనీసం రెండుమ్యాచ్ లు నెగ్గితీరాల్సి ఉంది. భారతజట్టులోని మొత్తం 15మంది సభ్యుల్లో వైస్ కెప్టెన్ కమ్ కీలక ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మాత్రమే కాలు మెలికపడి జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన కీలక 5వ రౌండ్ మ్యాచ్ లో పాండ్యా లేకుండానే భారత్ 4 వికెట్ల విజయంతో 10 జట్ల లీగ్ టేబుల్ అగ్రభాగంలో నిలువగలిగింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా నిచిన భారత్ మిగిలిన నాలుగురౌండ్ల లో ఇంగ్లండ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంకజట్లతో తలపడాల్సి ఉంది. దేశంలోని 10 నగరాలలో ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహిస్తుంటే..9 నగరాలు వేదికలుగా భారతజట్టు 9 మ్యాచ్ లు ఆడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.

హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది క్రికెట్ వేదికల్లోనూ భారత్ తన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు ఆడనుంది.

First Published:  24 Oct 2023 4:24 AM GMT
Next Story