ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
వీరితోపాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాల ప్రదానం
BY Raju Asari17 Jan 2025 12:15 PM IST
X
Raju Asari Updated On: 17 Jan 2025 12:15 PM IST
భారత అత్యున్న క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చెస్ ప్లేయర్ డి. గుకేశ్, హాకీ స్టార్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్‌కుమార్, షూటింగ్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ ఈ అవార్డులు అందుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు జివాంజి దీప్తి (పారా అథ్లెటిక్స్), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్) పురస్కారాలను స్వీరించారు. వీరితోపాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. లైఫ్‌టైం కేటగిరీలో మురళీధరణ్ (బ్యాడ్మింటన్), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్) పురస్కారాలు స్వీకరించారు.
Next Story