ఫుట్ బాల్ చరిత్రలో ఒకే ఒక్కడు...!
పోర్చుగీసు ఎవర్ గ్రీన్ సాకర్ స్టార్ , ప్రపంచ మేటి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫుట్ బాల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచాడు..
పోర్చుగీసు ఎవర్ గ్రీన్ సాకర్ స్టార్ , ప్రపంచ మేటి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫుట్ బాల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచాడు..
ప్రపంచ ఫుట్ బాల్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో 38 సంవత్సరాల వయసులో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.
లిస్బన్ వేదికగా జరిగిన 2023 యూరోపియన్ కప్ గ్రూపు అర్హత పోటీలలో పోర్చుగల్ జట్టులో సభ్యుడిగా తన 197 మ్యాచ్ ఆడటం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
లిచ్ స్టెన్ స్టెన్ తో జరిగిన లీగ్ తొలిరౌండ్ మ్యాచ్ లో రొనాల్డో తనజాతీయజట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఒకేజట్టు తరపున రికార్డుస్థాయిలో 197 మ్యాచ్ లు ఆడిన తొలి, ఏకైక ఆటగాడి ఘనతను రొనాల్డో సొంతం చేసుకొన్నాడు.
వయసుతో పని ఏముంది?
అంతర్జాతీయ స్థాయిలో ఏళ్ల తరబడి ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడాలంటే ప్రతిభతో పాటు ఫిట్ నెస్ సైతం ఉండితీరాలి. అది కేవలం యువఆటగాళ్లకే సాధ్యమనుకొంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. రొనాల్డో గత రెండు దశాబ్దాలుగా పోర్చుగల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ అత్యధిక మ్యాచ్ లు ఆడి అత్యధిక గోల్స్ సాధించిన పోర్చుగీసు ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఫుట్ బాల్ ఆడటానికి వయసుతో ఏమాత్రం పనిలేదని చాటి చెప్పాడు.
లిచ్టెన్‌స్టెన్‌తో పోరులో తనజట్టుకు అలవోక విజయం అందించాడు. ఈ మ్యాచ్ తో ఇప్పటి వరకూ కువైట్ ఆటగాడు బాదెర్ అల్ ముతావా(196 మ్యాచ్‌లు) పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీనికి తోడు యూరప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన సెర్గియో రామోస్(180) ఫీట్‌ను రొనాల్డో 2021లోనే అధిగమించగలిగాడు.
పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధికంగా 118 గోల్స్ సాధించిన మొనగాడిగా కూడా రొనాల్డో నిలిచాడు.
లిచ్టెన్‌స్టెన్‌తో ముగిసిన మ్యాచ్ లో పోర్చుగల్ 4-0 గోల్స్ విజయం సాధించడంలో రొనాల్డో ప్రధానపాత్ర వహించాడు. తనవంతుగా రెండుగోల్స్ నమోదు చేశాడు.
ఆట 51వ నిముషంలో పెనాల్టీని గోలుగా మలచిన రొనాల్డో..63వ నిముషంలో లభించిన ఫ్రీ-కిక్ ను సైతం గోలుగా మార్చి..పోర్చుగల్ తరపున వ్యక్తిగతంగా తన గోల్స్ సంఖ్యను 118కు పెంచుకోగలిగాడు.
2003లో పోర్చుగల్ తరపున తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన రొనాల్డో గత 20 సంవత్సరాల కాలంలో 197 మ్యాచ్ లు ఆడగలిగాడు.
ప్రస్తుతం 2024 యూరోపియన్ కప్ సాకర్ క్వాలిఫైయింగ్ రౌండ్లలో పాల్గొంటున్న రొనాల్డోకు మరో ఏడాదిలో జరిగే ఫైనల్ పోరు నాటికి 39 సంవత్సరాలు నిండుతాయి.
2024 యూరోకప్ లో రొనాల్డో పాల్గొనేది లేనిదీ రానున్న కాలమే చెప్పాలి.
యూరోపియన్ చాంపియన్షిప్ ఫైనల్స్ లో 14 గోల్స్, చాంపియన్స్ లీగ్ లో 140 గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రొనాల్డో పేరుతోనే పలు రికార్డులు ఉన్నాయి. అంతేకాదు. యూరోప్ లోని ఐదు ప్రధాన లీగ్ ల్లో..ఇంగ్లండ్, ఇటలీ, స్పానిష్ లీగ్ ల్లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ రికార్డులు సైతం రొనాల్డోకే దక్కాయి.
రొనాల్డో సాధించిన మొత్తం 780 గోల్స్ లో వివిధ క్లబ్ ల తరపున సాధించినవే 675కు పైగా గోల్స్ ఉన్నాయి. స్పోర్టింగ్ లిస్బన్ తరపున 5, మాంచెస్టర్ యునైటెడ్ తరపున 118, రియల్ మాడ్రిడ్ జట్టు సభ్యుడిగా 450గోల్స్, యువెంటస్ తరపున 95 గోల్స్ సాధించాడు. అంతేకాదు...తన జాతీయజట్టు పోర్చుగల్ తరపున 120 గోల్స్ సాధించడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.
2019 సీజన్లో 700 గోల్స్ మైలురాయిని చేరిన రొనాల్డో 2021 సీజన్ నాటికి కానీ 770 గోల్స్ మార్క్ ను చేరలేకపోయాడు. ప్రస్తుతం సౌదీ అరేబియన్ లీగ్ లో అల్- నాజర్ క్లబ్ కు రొనాల్డో ఆడుతున్నాడు. తనజట్టు తరపున ఇప్పటికే 8 గోల్స్ సాధించాడు.
తన కెరియర్ లో ఫుట్ బాల్ ఆడిన మొత్తం సమయంలో రొనాల్డో ప్రతి 112 నిముషాలకు ఓ గోల్ చొప్పున సాధించడం ఓ రికార్డుగా నిలిచిపోతుంది.
స్వీడన్ , లాత్వియా, ఆండోర్రా, అర్మీనియా ప్రత్యర్థులుగా పోర్చుగల్ తరపున రొనాల్డో అత్యధిక గోల్స్ నమోదు చేశాడు.
యూరోపియన్ క్వాలిఫైయింగ్ రౌండ్ గ్రూప్- జె పోటీలలో లగ్జెంబర్గ్, బోస్నియా అండ్ హెర్జిగోవినా, ఐస్ లాండ్, స్లవేకియాజట్లతో పోర్చుగల్ తలపడాల్సి ఉంది.
ఈ నాలుగుమ్యాచ్ ల్లోనూ రొనాల్డో పాల్గొనడం ఖాయమని చెప్పక తప్పదు.