Telugu Global
Sports

మహిళాటెన్నిస్ లో విలియమ్స్ సిస్టర్స్ శకానికి తెర!

ప్రపంచ మహిళా టెన్నిస్ డబుల్స్ లో అమెరికన్ బ్లాక్ థండర్స్, విలియమ్స్ సిస్టర్స్ వీనస్- సెరెనా జోడీల శకానికి తెరపడింది.

మహిళాటెన్నిస్ లో విలియమ్స్ సిస్టర్స్ శకానికి తెర!
X

ప్రపంచ మహిళా టెన్నిస్ డబుల్స్ లో అమెరికన్ బ్లాక్ థండర్స్, విలియమ్స్ సిస్టర్స్ వీనస్- సెరెనా జోడీల శకానికి తెరపడింది. 2022 అమెరికన్ కన్ ఓపెన్ డబుల్స్ లో ఆఖరుసారి పాల్గొన్న సిస్టర్స్ జట్టుకు తొలిరౌండ్లోనే చుక్కెదురయ్యింది.

ప్రపంచ మహిళా టెన్నిస్ డబుల్స్ లో గత రెండున్నర దశాబ్దాలుగా తమ ఆటతీరుతో ఉర్రూత లూగించిన అమెరికన్ బ్లాక్ థండర్స్ జోడీ వీనస్- సెరెనా శకం ముగిసింది.

కాలిఫోర్నియాలోని మురికివాడల నుంచి ప్రపంచ మహిళాటెన్నిస్ లోకి టీనేజ్ వయసులోనే దూసుకొచ్చిన విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్ తమ పవర్ టెన్నిస్ తో

డజన్లకొద్దీ గ్రాండ్ స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్ పతకాలతో పాటు కోట్ల డాలర్లు సంపాదించారు.

15 సంవత్సరాలపాటు గ్రాండ్ స్లామ్ సర్క్యూట్ మహిళల సింగిల్స్, డబుల్స్ లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించిన విలియమ్స్ సిస్టర్స్ తమ కెరియర్ లో 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించారు. మూడుసార్లు ఒలింపిక్స్ లో బంగారు పతకాలు గెలుచుకొన్నారు.

2018 తర్వాత తొలిసారిగా...

ప్రపంచ మహిళాడబుల్స్ లో వివిధ టోర్నీలలో చివరిసారిగా 2018లో జంటగా పాల్గొన్నవిలియమ్స్ సిస్టర్స్ తమ కెరియర్ ను 2022 యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గడం ద్వారా ముగించాలని కోరుకొన్నారు.

అయితే..సిస్టర్స్ ఒకటి తలస్తే..విధి మరోలా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రస్తుత అమెరికన్ ఓపెన్ డబుల్స్ బరిలో నిలిచిన సిస్టర్స్ జోడీకి తొలిరౌండ్లోనే గుండెచెదిరే ఫలితం ఎదురయ్యింది.

చెక్ జోడీ లూసీ- లిండాలతో జరిగిన పోరులో 6-7, 4-6తో సిస్టర్స్‌ జోడీ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. న్యూయార్క్ ఆర్థర్ యాష్‌ స్టేడియం వేదికగా ముగిసిన ఈ వీడ్కోలు డబుల్స్‌ మ్యాచ్ కు అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు.

సెరెనా పూర్తి ఫిట్ నెస్ తో ఆడినా..వీనస్‌ మాత్రం కోర్టులో చురుకుగా కదలలేకపోయింది. వయసు మీద పడిన చాయలు స్పష్టంగా కనిపించాయి.

2018 తర్వాత సిస్టర్స్జ్ జోడీ తమ రిటైర్మెంట్‌ కోసమే అన్నట్లుగా చివరిసారిగా బరిలో నిలిచారు.

ఈ ఓటమితో రెండుదశాబ్దాల విలియమ్స్ సిస్టర్స్ డబుల్స్ ప్రస్థానం ముగిసింది. ఓటమి అనంతరం సిస్టర్స్ ఒకరినొకరు హత్తుకొని మరీ కన్నీరు మున్నీరయ్యారు.

మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో అజ్లాతో సెరెనా తలపడాల్సి ఉంది.

First Published:  2 Sept 2022 11:23 AM IST
Next Story