ఆ రికార్డు సమం చేస్తే.. ప్రపంచకప్ మనదే..
2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ గెలిచి కప్పు ఎగరేసుకుపోయింది. ఆ వరల్డ్ కప్‌లో భారతజట్టు ఫైనల్లో ఓడిపోయింది. అంతకు ముందు లీగ్ మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
ప్రపంచకప్‌లో టీమిండియా జట్టు దూసుకుపోతోంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన జట్టు మనదొక్కటే. ఫైనల్ పోరుకు ఇంకొక్క అడుగు దూరంలో ఉంది. అది సాధిస్తే ఈ ప్రపంచకప్ మనదే. ఇదే క్రమంలో టీమిండియాను మరో రికార్డు ఊరిస్తోంది. ప్రపంచకప్‌లో 11మ్యాచ్‌లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా పేరుమీదుంది. ఆ లెక్కన మనం కూడా రాబోయే రెండు మ్యాచ్‌లు (సెమీఫైనల్, ఫైనల్) గెలిస్తే ఆ రికార్డును సమం చేయడంతోపాటు కప్పు కూడా మన చేతుల్లోకి వచ్చేసినట్లే.
ఆస్ట్రేలియా రెండుసార్లు
2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ గెలిచి కప్పు ఎగరేసుకుపోయింది. ఆ వరల్డ్ కప్‌లో భారతజట్టు ఫైనల్లో ఓడిపోయింది. అంతకు ముందు లీగ్ మ్యాచ్లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో తప్ప మిగిలిన 9 మ్యాచ్‌ల్లోనూ గెలవడం గమనార్హం. ఆస్ట్రేలియా 2007లోనూ 11 మ్యాచ్‌లు నెగ్గి కప్పు గెలిచింది.
ఈ ఊపులో గెలవడం అంత కష్టమేం కాదు
ప్రస్తుతం సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని ఫార్మాట్లోనూ పూర్తి పటిష్టంగా టోర్నమెంట్‌లో టాప్ టీమ్‌గా ఉంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌తో గెలిస్తే కప్పు మనదే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇప్పుడున్న ఫామ్‌లో భారత్‌కు న్యూజిలాండ్‌ను ఓడించడం అంత కష్టమేమీ కాదని, మూడోసారి ప్రపంచకప్ గెలవడం సాధ్యమే అంటున్నారు. ఆల్ ద బెస్ట్ టీమిండియా.