Telugu Global
Sports

కప్పుకొడితే 13 కోట్ల నజరానా, ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ

విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 13 కోట్ల 50 లక్షల 35వేల 440 రూపాయల ప్రైజ్ మనీ అందచేయనున్నారు. రన్నరప్ జట్టుకు 6 కోట్ల 52 లక్షల 64వేల 280 రూపాయలు దక్కనున్నాయి.

T20 World Cup 2022 Prize Money
X

ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 16న ప్రారంభంకానున్న8వ టీ-20 ప్రపంచకప్ ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. గత ప్రపంచకప్ కంటే ప్రస్తుత ప్రపంచకప్ విజేత జట్లకు మరింత ఎక్కువగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది.

2022 టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టోర్నీలో పాల్గొనే జట్లకు ఇచ్చే ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) దుబాయిలో ప్రకటించింది.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ ఆస్ట్రేలియాలోని పలు వేదికల్లో జరిగే ఈ టోర్నీలో మొత్తం 12 అత్యుత్తమజట్లు ఢీ కొనబోతన్నాయి.

సూపర్ -12 రౌండ్ నుంచి ఫైనల్లో విజేతగా నిలిచిన జట్ల వరకూ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.

45 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ...

ఎనిమిదో టీ-20 ప్రపంచకప్ విజేతల కోసం ఐసీసీ మొత్తం 45కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కేటాయించింది. సూపర్-12 రౌండ్లో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, నమీబియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడనున్నాయి. రెండో అంచె సూపర్ -12 రౌండ్లో 12 ప్రధానజట్లు టైటిల్ సమరంలో పాల్గోనున్నాయి.

విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 13 కోట్ల 50 లక్షల 35వేల 440 రూపాయల ప్రైజ్ మనీ అందచేయనున్నారు. రన్నరప్ జట్టుకు 6 కోట్ల 52 లక్షల 64వేల 280 రూపాయలు దక్కనున్నాయి.

సెమీస్ లో ఓడిన రెండుజట్లకు చెరో 3 కోట్ల 26 లక్షల 20వేల 220 రూపాయల చొప్పున ఇస్తారు. సూపర్ -12 రౌండ్ నుంచే నిష్క్ర్రమించినజట్లకు 57 లక్షల రూపాయల చొప్పున, సూపర్ -12 రౌండ్లో విజయం సాధించిన జట్లకు మ్యాచ్ కు 32 లక్షల 62వేల 22 రూపాయల చొప్పున అందచేస్తారు.

గత ప్రపంచకప్ విజేతకు 11 కోట్ల 90 లక్షలు ప్రైజ్ మనీగా చెల్లించగా...ప్రస్తుత టోర్నీలో ఆ మొత్తం 13 కోట్ల 50 లక్షలకు పెరిగింది.

ఎమిరేట్స్ వేదికగా జరిగిన 2021 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టిన మాజీ చాంపియన్, టాప్ ర్యాంకర్ భారత్..ప్రస్తుత ప్రపంచకప్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది.

నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ ప్రపంచకప్ తో పాటు 13 కోట్ల 50 లక్షల రూపాయల విన్నర్ చెక్ ను అందచేయనున్నారు.

First Published:  1 Oct 2022 11:10 AM IST
Next Story