Telugu Global
Sports

భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్సన్‌ ఎత్తివేత

దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు మార్గం సుగమం

భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై సస్పెన్సన్‌ ఎత్తివేత
X

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర క్రీడాశాఖ ఎత్తివేసింది. తద్వారా దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ట ఎంపిక కోసం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు మార్గం సుగమం చేసింది. అండర్‌ 15, అండర్‌ 20 జాతీయ ఛాంపియన్‌ షిప్‌లను హడావుడిగా ప్రకటించినందుకు 20223 డిసెంబర్‌ 24న భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై క్రీడాశాఖ సస్పెన్సన్‌ విధించింది. డబ్ల్యూఎఫ్‌ఐ కి జరిగిన ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌ నమ్మిన బంటు సంజయ్‌ సింగ్‌ గెలిచాడు. అతని నేతృత్వంలోని ప్యానెల్‌ 2023 డిసెంబర్‌ 21న విజయం సాధించింది. అయితే డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ గోండాలోని నందిని నగర్‌లో జాతీయ ఛాంపియన్‌ షిప్‌ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఆ కారణంగానే డబ్ల్యూఎఫ్‌ఐని సస్పెండ్‌ చేసింది. తాజాగా దిద్దుబాటు చర్యలు తీసుకున్నందున సస్పెన్సన్‌ ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కేంద్రం పేర్కొన్నది. లైంగిక వేధింపుల ఆరోపణలతో సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషన్‌కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు పోరాటం చేసిన విషయం విదితమే.

First Published:  11 March 2025 12:30 PM IST
Next Story